అలా కాదు! హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వారిలో నుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది, కావున సత్యతిరస్కారులు ఇలా అన్నారు1: "ఇది ఆశ్చర్యకరమైన విషయం!
మరియు అయ్ కహ్ (వన) వాసులు మరియు తుబ్బఅ1 జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు, కావున నా బెదరింపు వారి విషయంలో సత్యమయింది.
మరియు వాస్తవంగా, మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము ఎరుగుతాము.1 మరియు మేము అతనికి అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాము.
(ఇలా అనబడుతుంది): "వాస్తవానికి నీవు (ఈ దినాన్ని గురించి) నిర్లక్ష్యంగా ఉండే వాడివి. కావున ఇపుడు మేము నీ ముందున్న తెరను తొలగించాము. కావున, ఈ రోజు నీ దృష్టి చాలా చురుకుగా ఉంది."
అతని స్నేహితుడు (ఖరీనున్) ఇలా అంటాడు:1 "ఓ మా ప్రభూ! నేను ఇతని తలబిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కాని ఇతడే స్వయంగా, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళి పోయాడు."
మరియు మేము, వీరికి పూర్వం ఎన్నో తరాల వారిని నాశనం చేశాము. వారు వీరి కంటే ఎక్కువ శక్తిమంతులు. కాని, (మా శిక్ష పడినప్పుడు) వారు దేశదిమ్మరులై పోయారు. ఏమీ? వారికి తప్పించుకునే మార్గం ఏదైనా దొరికిందా?
కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా;1