ఇక నిషిద్ధమాసాలు[1] గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి.[2] మరియు వారిని పట్టుకోండి[3] మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండండి[4]. కాని వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే, వారిని వారి మార్గాన వదలి పెట్టండి.[5] నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. 1