మరియు అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే, మీకు నచ్చిన (ఇతర) స్త్రీలను ఇద్దరిని గానీ, ముగ్గురిని గానీ, నలుగురిని గానీ వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించ లేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే; [1] లేదా మీ స్వాధీనంలో నున్నవారిని (బానిస స్త్రీలను దాంపత్యంలోకి) తీసుకోండి.[2] ఒకే వైపునకు మొగ్గకుండా (అన్యాయవర్తన నుండి దూరంగా ఉండటానికి) ఇదే సముచితమైన మార్గం. 1