ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి.[1] అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే! 1