మరియు నిశ్చయంగా, గ్రంథ ప్రజలలో, కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్ కు వినమ్రులై, అల్లాహ్ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ముకోరు[1]. అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు. 1