వారితో (విశ్వాసులతో) ప్రజలు: "వాస్తవానికి, మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి." అని అన్నప్పుడు, వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు: "మాకు అల్లాహ్ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు." [1] అని అన్నారు.[2] 1