ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ భూమిలో ఉన్న సమస్తాన్ని మీకు వశపరచాడు. మరియు సముద్రంలో పడవ ఆయన అనుమతితోనే నడుస్తుంది మరియు ఆయనే! తాను అనుమతించే వరకు ఆకాశాన్ని భూమి మీద పడకుండా నిలిపి ఉంచాడు.[1] నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత. 1