ఆ తరువాత వారు, అల్లాహ్ అనుమతితో వారిని (సత్యతిరస్కారులను) ఓడించారు. మరియు దావూద్, జాలూత్ ను సంహరించాడు [1] మరియు అల్లాహ్ అతనికి (దావూద్ కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది. కానీ అల్లాహ్ సమస్త లోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు."[2] 1