నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు[1]. కావున ఎవడు (కఅబహ్) గృహానికి 'హజ్జ్ లేక 'ఉమ్రా కొరకు పోతాడో[2], అతడు ఈ రెంటి మధ్య పచార్లు (స'యీ) చేస్తే, అతనికి ఎట్టి దోషం లేదు. మరియు ఎవడైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచికార్యం చేస్తే! నిశ్చయంగా, అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు[3], సర్వజ్ఞుడు. 1