మరియు ఈ (కఅబహ్) గృహాన్ని మేము మానవులను తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్యస్థలం)గా మరియు శాంతి నిలయంగా చేసి,[1] ఇబ్రాహీమ్ నిలబడిన చోటును మీరు నమాజ్ చేసే స్థలంగా చేసుకోండన్న[2] విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). మరియు మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ లకు: "నా ఈ గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కొరకూ, ఏకాంత ధ్యానం (ఏతికాఫ్) పాటించేవారి కొరకూ, వంగే (రుకూఉ చేసే) వారి కొరకూ మరియు సజ్దాలు చేసే వారి కొరకూ పరిశుద్ధంగా ఉంచండి." అని నిర్దేశించాము. 1