فَمَنۡ
أَظۡلَمُ
مِمَّنِ
ٱفۡتَرَىٰ
عَلَى
ٱللَّهِ
كَذِبًا
أَوۡ
كَذَّبَ
بِـَٔايَٰتِهِۦٓۚ
أُوْلَٰٓئِكَ
يَنَالُهُمۡ
نَصِيبُهُم
مِّنَ
ٱلۡكِتَٰبِۖ
حَتَّىٰٓ
إِذَا
جَآءَتۡهُمۡ
رُسُلُنَا
يَتَوَفَّوۡنَهُمۡ
قَالُوٓاْ
أَيۡنَ
مَا
كُنتُمۡ
تَدۡعُونَ
مِن
دُونِ
ٱللَّهِۖ
قَالُواْ
ضَلُّواْ
عَنَّا
وَشَهِدُواْ
عَلَىٰٓ
أَنفُسِهِمۡ
أَنَّهُمۡ
كَانُواْ
كَٰفِرِينَ
٣٧
ఇక అల్లాహ్ పై అసత్యాలు కల్పించే వాని కంటే; లేదా ఆయన సూచనలను అసత్యాలని తిరస్కరించే వాని కంటే మించిన దుర్మార్గుడెవడు? అలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగ్యాన్ని పొందుతారు1. తుదకు మేము పంపే దైవదూతలు వారి ప్రాణాలు తీయటానికి వారి వద్దకు వచ్చి: "మీరు అల్లాహ్ ను వదలి ప్రార్థించేవారు (ఆ దైవాలు) ఇపుడు ఎక్కడున్నారు?" అని అడుగుతారు. వారిలా జవాబిస్తారు: "వారు మమ్మల్ని వదిలి పోయారు." మరియు ఈ విధంగా వారు: "మేము నిజంగానే సత్యతిరస్కారులమై ఉండేవారము." అని తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిచ్చుకుంటారు.