(ఓ ప్రవక్తా!) వారు నిన్ను ఆ అంతిమఘడియను గురించి: "అది ఎప్పుడు రానున్నది?" అని అడుగుతున్నారు. వారితో ఇలా అను: "నిస్సందేహంగా, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది.[1] కేవలం ఆయన స్వయంగా దానిని, దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యాకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది." దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి, వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానం ఇవ్వు: "నిస్సందేహంగా, దాని జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు."[2] 1