నిశ్చయంగా, విశ్వసించి వలస పోయే వారూ మరియు తమ సంపద మరియు ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారూ,[1] వారికి ఆశ్రయమిచ్చేవారూ మరియు సహాయం చేసేవారూ,[2] అందరూ ఒకరికొకరు మిత్రులు.[3] మరియు ఎవరైతే విశ్వసించి వలస పోలేదో వారు, వలస పోనంత వరకు వారి మైత్రిత్వంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. కాని వారు ధర్మం విషయంలో మీతో సహాయం కోరితే, వారికి సహాయం చేయటం మీ కర్తవ్యం; కాని మీతో ఒడంబడిక ఉన్న జాతి వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు. 1