أَوَلَمۡ
يَرَ
ٱلَّذِينَ
كَفَرُوٓاْ
أَنَّ
ٱلسَّمَٰوَٰتِ
وَٱلۡأَرۡضَ
كَانَتَا
رَتۡقٗا
فَفَتَقۡنَٰهُمَاۖ
وَجَعَلۡنَا
مِنَ
ٱلۡمَآءِ
كُلَّ
شَيۡءٍ
حَيٍّۚ
أَفَلَا
يُؤۡمِنُونَ
٣٠
ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని?1 మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము.2 ఇకనైన వారు విశ్వసించరా?