మరియు వారు: "ఒకవేళ మా వద్దకు అద్భుత సూచన (మహిమ) వస్తే, మేము తప్పక విశ్వసిస్తాము." అని అల్లాహ్ పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తారు. వారితో అను: "నిశ్చయంగా, అద్భుత సూచనలు (మహిమలు) అల్లాహ్ వశంలోనే ఉన్నాయి[1]. ఒకవేళ అవి (అద్భుత సూచనలు) వచ్చినా, వారు విశ్వసించరని (ఓ ముస్లిములారా!) మీకు ఏ విధంగా గ్రహింపజేయాలి?" 1